Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... 8 మంది దుర్మరణం
![Eight people died in fatal accident in Ananthapur district](https://imgd.ap7am.com/thumbnail/cr-20220206tn61ffd664687e2.jpg)
- ఉరవకొండ మండలంలో ఘటన
- కారును ఢీకొన్న లారీ
- నుజ్జునుజ్జయిన కారు
- మృతులు నిమ్మగల్లు గ్రామానికి చెందినవారు
అనంతపురం జిల్లాలో రహదారి నెత్తురోడింది. ఉరవకొండ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. బుదగవి వద్ద కారు, లారీ ఢీకొన్నాయి. బళ్లారిలో పెళ్లికి వెళ్లిన ఓ బృందం కారులో అనంతపురానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారును వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. మృతులు ఉరవకొండ మండలంలో నిమ్మగల్లు గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో సంఘటన స్థలం శోకసంద్రంలా మారింది.