Madan Karky: పవన్ కల్యాణ్ తో సాహిత్యం, రాజకీయాలపై చర్చ ఎంతో ఆసక్తికరంగా సాగింది: మదన్ కార్కీ

Madan Karky met Pawan Kalyan

  • 'హరిహర వీరమల్లు'లో నటిస్తున్న పవన్
  • తమిళంలోనూ విడుదలవుతున్న చిత్రం
  • పవన్ నివాసంలో తమిళ సినీ రచయితలు కార్కీ, కణ్ణన్

కోలీవుడ్ సినీ గీత, కథా రచయిత మదన్ కార్కీ టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను కలిశారు. ఆయనతో భేటీ ఎంత ఉల్లాసంగా సాగిందో కార్కీ ట్విట్టర్ లో వెల్లడించారు.

పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. కాగా, దర్శకుడు క్రిష్, ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం, రచయిత కణ్ణన్ లతో కలిసి మదన్ కార్కీ నేడు పవన్ కల్యాణ్ నివాసానికి విచ్చేశారు.

ఈ భేటీపై కార్కీ స్పందిస్తూ... "పవన్ కల్యాణ్ సర్ తో సాహిత్యం, రాజకీయాలు, మానవ వికాసం, భాషలు వంటి అంశాలపై ఎంతో లోతైన చర్చ జరిగింది. ఆయన కొత్త చిత్రం కోసం పాటలు, డైలాగులపై ఆసక్తికర రీతిలో చర్చించాం" అని వివరించారు. పవన్ తో భేటీకి సంబంధించిన ఫొటోలను కూడా మదన్ కార్కీ ట్విట్టర్ లో పంచుకున్నారు.

Madan Karky
Pawan Kalyan
Hari Hara Veeramallu
Krish
  • Loading...

More Telugu News