IMD: దేశంలో మెజారిటీ ప్రజలు ‘ప్రకృతి’ విపత్తుల బాధితులే

24 percent of Indians vulnerable to cold waves IMD

  • భాతర వాతావరణ విభాగం అట్లాస్ వెల్లడి
  • ఎక్కువ జనాభా, జిల్లాలపై చలి గాలుల ప్రభావం
  • ప్రకృతి విపత్తులతో ప్రాణ, ఆస్తి నష్టం
  • జీవనోపాధికి ఇబ్బంది

దేశంలో అత్యధిక జనాభా ప్రకృతిలో వచ్చే మార్పులు, వాతావరణ బాధితులుగా ఉంటున్నారు. ఈ విషయాన్ని భాతర వాతావరణ శాఖకు చెందిన ‘క్లైమేట్ హజార్డ్స్ అండ్ వల్ నరబులిటీ అట్లాస్’ తెలిపింది. ఇందుకు సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది.

దేశంలోని 16 శాతం జిల్లాలు, 24 శాతం జనాభా అతి శీతల గాలులకు బాధితులుగా ఉంటున్నారు. ఉత్తరప్రదేశ్ లో 75 జిల్లాలు, రాజస్థాన్ లో 17 జిల్లాలు, బిహార్ లో 14 జిల్లాలు, జార్ఖండ్ లో ఒక జిల్లా, పంజాబ్ లో ఒక జిల్లా చలి గాలుల ప్రభావాన్ని ఎక్కువగా ఎదుర్కొంటున్నాయి.

అత్యధిక జిల్లాలు, జనాభా కరవు, శీతల గాలులు, గాలి దుమ్ము ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. చలి, వేడి గాలులు, వరదలు, పిడుగులు, మంచు కురియడం, దుమ్ము పవనాలు, దుమ్ము తుఫానులు, వడగండ్ల వాన, ఉరుములతో కూడిన వర్షం, పొగమంచు, అధిక వర్షాలు, తుఫాను, బలమైన గాలులు, కరవు ఎక్కువ మంది ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఆరోగ్య సమస్యలు, ఆస్తి నష్టం, జీవనోపాధి నష్టానికి దారితీస్తున్నాయి.

దేశంలో సుమారు 8 శాతం జిల్లాలు, 7 శాం జనాభా పొగ మంచు ప్రభావాన్ని ఎక్కువగా చవిచూస్తున్నాయి. అత్యధిక మంచు ప్రభావం 2 శాతం జిల్లాలపై ఉంది.

  • Loading...

More Telugu News