Narendra Modi: శ్రీరామనగరంలో సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ... వీడియో ఇదిగో!

PM Modi unveils Samatha Murthi statue in Srirama Nagaram

  • రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు
  • ముచ్చింతల్ ఆశ్రమంలో విష్వక్సేనేష్ఠి యాగం
  • పాల్గొన్న ప్రధాని మోదీ
  • మోదీని రాముడితో పోల్చిన చిన్నజీయర్ స్వామి

ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చింతల్ ఆశ్రమంలోని శ్రీరామనగరంలో ఏర్పాటు చేసిన భారీ రామానుజాచార్యుల వారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహాన్ని జాతికి అంకితం చేశారు. అంతకుముందు ఆయన విష్వక్సేనేష్ఠి యాగంలో పాల్గొన్నారు. ఈ క్రతువు అనంతరం లాంఛనంగా విగ్రహావిష్కరణ జరిగింది.

ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూ, శ్రీరామచంద్రుడిలా ప్రధాని మోదీ కూడా వ్రతబద్ధుడు అని కొనియాడారు. రాముడి బాటలోనే మోదీ కూడా రాజధర్మం ఆచరిస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాదు, రామానుజాచార్యుల వారు ఎంతటి సుగుణవంతులో మోదీ కూడా అంతే సుగుణశీలి అని కీర్తించారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మోదీ కంకణబద్ధులై ఉన్నారని తెలిపారు. మోదీ ప్రధాని పీఠం ఎక్కాక దేశ ప్రజలు తలెత్తుకుని జీవిస్తున్నారని చిన్నజీయర్ వ్యాఖ్యానించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News