Raviteja: రవితేజ దూకుడు .. హిందీలోను 'ఖిలాడి' రిలీజ్!

Khiladi movie update

  • రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి'
  • రవితేజ సరసన ఇద్దరు భామలు
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్
  • ఈ నెల 11వ తేదీన విడుదల  

నిన్నమొన్నటి వరకూ తెలుగులో వచ్చిన చాలా సినిమాలు తమిళంలోను విడుదలయ్యేలా చూస్తూ వచ్చారు. అయితే తెలుగు సినిమాలను హిందీలోకి అనువదించి యూ ట్యూబ్ ద్వారా వదిలితే ఒక రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు కాదు కంటెంట్ ఉంటే హిందీలోను తెలుగు సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు.

అందుకు ఉదాహరణగా ఇటీవల కాలంలో హిందీలో రిలీజ్ అయిన 'పుష్ప' సినిమా సాధించిన వసూళ్లను చెప్పుకోవచ్చు. దాంతో తెలుగుతో పాటు హిందీలోను తమ సినిమాలు విడుదలయ్యేలా హీరోలు ఉత్సాహాన్ని చూపుతున్నారు. అదే బాటలో ఇప్పుడు 'ఖిలాడి' కూడా ముందుకు వెళుతోంది. ఈ నెల 11వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది.

ముందుగా ఈ సినిమాను తెలుగులో మాత్రమే విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను హిందీలోను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, మీనాక్షి చౌదరి - డింపుల్ హయతి అందాల సందడి చేయనున్నారు.

Raviteja
Meenakshi
Dimple
Khiladi Movie
  • Loading...

More Telugu News