JK Bharavi: అందుకే ఆర్థికంగా ఇంత ఇబ్బందిపడుతున్నాను: 'అన్నమయ్య' రచయిత జె.కె.భారవి

JK Bharavi Interview

  • ఎన్నో గొప్ప సినిమాలకు పనిచేశాను
  • గౌరవ మర్యాదలు పొందాను
  • ఆ సినిమాతో ఉన్నదంతా పోయింది
  • ఎవరిముందూ చేయిచాచడం ఇష్టం ఉండదన్న భారవి

రాఘవేంద్రరావు తెరకెక్కించిన భక్తి చిత్రాలతో రచయితగా జేకే భారవి పేరు మరింతగా వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో తెలుగు .. కన్నడ భాషల్లో ఎక్కడ చూసినా ఆయన పేరే వినిపించింది. అలాంటి ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ప్రస్తుతం తాను ఉన్న పరిస్థితి గురించి ప్రస్తావించారు.

"కెరియర్లో ఎన్నో కార్లు చూసిన నేను .. ఈ రోజున ఈ ఇంటర్వ్యూకి 'ఓలా' బైక్ పై వచ్చాను. రాఘవేంద్రరావుగారితో 'కవిగారూ' అని పిలిపించుకున్న నేను, ప్రస్తుతం ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నాను. అందుకు కారణం నేను నిర్మించిన 'జగద్గురు ఆదిశంకర' సినిమా. ఇంతకాలం నేను సంపాదించిందంతా ఆ ఒక్క సినిమాతో పోయింది.

తెలుగు .. కన్నడ భాషల్లో నా కథలు ఓకే అయినవి ఉన్నాయి .. కానీ కరోనా వలన డబ్బు చేతికి రావడం ఆలస్యమవుతోంది. నా పరిస్థితి ఇది అని చెబితే రాఘవేంద్రరావు గారు .. నాగార్జున గారు వెంటనే సాయం చేస్తారు. కానీ ఎవరిముందూ చేయిచాచడం నాకు ఇష్టం లేదు. అలా బతకాలని నేను అనుకోవడం లేదు" అంటూ చెప్పుకొచ్చారు.

JK Bharavi
Raghavendra Rao
Nagarjuna
Jagadguru Adi Shankara Movie
  • Loading...

More Telugu News