Karnataka: సూట్‌కేసులో కుక్కి గాళ్‌ఫ్రెండ్‌ను హాస్టల్‌కు తెచ్చే యత్నం.. దొరికిపోయిన ఇంజినీరింగ్ విద్యార్థి.. వీడియో ఇదిగో!

Karnataka boy tries to sneak girlfriend inside Manipal hostel in trolley suitcase

  • తనతోపాటు అదే కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థిని
  • తన గదికి తెచ్చుకునే ప్రయత్నంలో దొరికిపోయిన విద్యార్థి
  • ఇద్దరినీ సస్పెండ్ చేసిన కాలేజ్ యాజమాన్యం

దురదృష్టమేంటో కానీ ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసినా కొన్నిసార్లు దొరికిపోతుంటారు కొందరు. ఈ విషయంలో విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ చేసేవారు ముందు వరుసలో ఉంటారు. శరీర అంతర్భాగాల్లో దాచుకుని స్మగ్లింగ్ చేసినా పట్టుబడి జైలుపాలవుతుంటారు. తాజాగా, ఓ ఇంజినీరింగ్ విద్యార్థికి తనతోపాటు అదే కాలేజీలో చదువుకుంటున్న గాళ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉండాలనిపించింది.

అనుకున్నదే తడవుగా చక్కని ప్లాన్ వేశాడు. ఓ పెద్ద ట్రాలీ సూట్‌కేసులో అమ్మాయిని కుక్కేసి ఎవరికీ అనుమానం రాకుండా హాస్టల్‌కు తెచ్చే ప్రయత్నం చేశాడు. అయితే, ప్లాన్ బెడిసికొట్టడంతో కాలేజీ నుంచి ఇద్దరూ సస్పెండయ్యారు. కర్ణాటకలోని ఎంఐటీ మణిపాల్ హాస్టల్‌లో జరిగిందీ ఘటన.

అంతపెద్ద ట్రాలీ సూట్‌కేసును లాక్కొస్తున్న విద్యార్థిని గమనించిన హాస్టల్ వార్డెన్ అనుమానంతో అతడిని ఆపాడు. అందులో ఏమున్నాయని ప్రశ్నించాడు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వస్తువులు ఉన్నాయని బదులులిచ్చాడు. అయితే, విద్యార్థి తీరు అనుమానాస్పదంగా ఉండడంతో ట్రాలీని బలవంతంగా తెరిపించాడు. ఆ వెంటనే అందులోంచి బయటపడిన అమ్మాయిని చూసి వార్డెన్ అవాక్కయ్యాడు. దీంతో ఇద్దరినీ సస్పెండ్ చేసి ఇంటికి పంపారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News