Mallikarjuna Reddy: సమ్మెకు వెళ్లొద్దు... ఆర్టీసీ విలీనం ద్వారా సీఎం జగన్ చేసిన మేలు మర్చిపోవద్దు: కార్మికులకు ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి హితవు

APSRTC Chairman Mallikarjuna Reddy appeals RTC Employees do not go to strike

  • ఈ నెల 7 నుంచి ఉద్యోగుల సమ్మెబాట
  • సిద్ధమవుతున్న ఆర్టీసీ సిబ్బంది
  • పీఆర్సీకి, ఆర్టీసీ సిబ్బందికి సబంధంలేదన్న మల్లికార్జునరెడ్డి
  • ఆర్టీసీని కాపాడుకుందామని పిలుపు

దాదాపు 70కి పైగా డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తున్న ఏపీ ఉద్యోగులు ఈ నెల 7 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సమ్మెలో పాల్గొనేందుకు ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది కూడా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి స్పందించారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు వెళ్లొద్దని కోరారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా సీఎం జగన్ చేసిన మేలును మర్చిపోవద్దని హితవు పలికారు. త్వరలోనే మిగిలిన సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని, ఆర్టీసీని కాపాడుకుందామని పిలుపునిచ్చారు.

ప్రస్తుత పీఆర్సీకి, ఆర్టీసీ సిబ్బందికి సంబంధంలేదని మల్లికార్జునరెడ్డి స్పష్టం చేశారు. సమ్మె వల్ల ఉద్యోగుల ప్రయోజనాలకే విఘాతం కలుగుతుందని అన్నారు. గతంలో తెలంగాణలో ఏం జరిగిందో గుర్తుచేసుకోవాలని హితవు పలికారు.

  • Loading...

More Telugu News