cancer cases: తెలంగాణలో పెరుగుతున్న కేన్సర్ ముప్పు.. ఏడుగురిలో ఒకరికి మహమ్మారి!

Telanganas cancer tally rising by doctors red flag excessive use of tobacco

  • జీవనశైలి ప్రభావం
  • కాలుష్యం, పొగాకు అలవాట్లు కారణం
  • బ్రెస్ట్, హెడ్, లంగ్, నెక్ కేన్సర్ కేసులు ఎక్కువ
  • ముందుగా గుర్తిస్తే నయం చేసుకోవచ్చు
  • వైద్య నిపుణుల సూచన

జీవనశైలి మార్పులతో తెలంగాణలో కేన్సర్ ముప్పు పెరిగిపోతోంది. 2025 నాటికి 53వేల కొత్త కేసులు వెలుగు చూడొచ్చని  నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ రీసెర్చ్ (ఎన్ సీడీఐఆర్) తెలిపింది. 2020లో తెలంగాణలో 47,620 కేన్సర్ కేసులు నమోదైనట్టు ప్రకటించింది.

బ్రెస్ట్, లంగ్, హెడ్, నెక్, సర్విక్స్, స్టమక్ కేన్సర్ కేసులు ఎక్కువగా ఉంటున్నట్టు తెలిపింది. ‘‘ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో హెడ్, నెక్ కేన్సర్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. పొగాకును ఇష్టారీతిన వినియోగించడం హెడ్, నెక్ కేన్సర్ కు ప్రధాన కారణం. ప్రతి 10 కేన్సర్ రోగుల్లో 6-7 మందికి ఈ అలవాటు ఉంటోంది’’ అని కేన్సర్ స్పెషలిస్ట్ అయిన ఓ వైద్యురాలు తెలిపారు.

తెలంగాణలో 2025 నాటికి 74 ఏళ్లలోపు వయసున్న ప్రతీ ఏడుగురు మహిళల్లో ఒకరు, ప్రతి తొమ్మిది మంది పురుషుల్లో ఒకరు కేన్సర్ బారిన పడొచ్చు. నేడు కేన్సర్ కేసులు ఎక్కువగా ఉండడానికి పరిశుభ్రతలేమి, ఆహార అలవాట్లు, కదలికల్లేని జీవనశైలి కారణం. కాలుష్య ప్రభావం కూడా కారణమే’’ అని వైద్యులు అంటున్నారు.

ముందస్తుగా గుర్తించడం ఒక్కటే రక్షించుకునే మార్గంగా వైద్యులు సూచిస్తున్నారు. కేన్సర్ ను మొదటి దశలో గుర్తిస్తే 90 శాతం వరకు పూర్తిగా నయం చేసుకోవచ్చని చెబుతున్నారు. ముందుగా గుర్తించి, చికిత్స తీసుకోవడమే మెరుగైన మార్గమని పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News