RGV: విజయవాడలో జనసందోహాన్ని చూసి భయంతో చలి జ్వరం వచ్చింది.. ‘చలో విజయవాడ’పై రాంగోపాల్ వర్మ వరుస ట్వీట్లు

It is a shock to me says RGV on PRC Protest

  • ఉద్యోగుల ‘చలో విజయవాడ’పై ఆర్జీవీ వరుస ట్వీట్లు
  • రోడ్డెక్కిన లక్షలాదిమందిని చూసి షాకయ్యానన్న వర్మ
  • ప్రపంచంలో ఇలా ఎక్కడైనా జరిగిందా? అన్న సందేహం
  • మౌనం పిరికితనమన్న దర్శకుడు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు నిన్న నిర్వహించిన ‘చలో విజయవాడ’ ఊహించిన దానికి మించి విజయవంతమైంది. పోలీసుల నిర్బంధాన్ని ఛేదించుకుని లక్షలాదిమంది ఉద్యోగులు విజయవాడ తరలివచ్చి తమ సత్తా చాటారు. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ ఘటనపైనా స్పందించారు.

ఉప్పెనలా తరలి వచ్చిన ఉద్యోగుల ఫొటోలను ట్వీట్ చేశారు. ప్రభుత్వం సంగతేమో కానీ ఆ జనాన్ని చూసి తనకు మాత్రం భయంతో చలి జ్వరం వచ్చిందని రాసుకొచ్చారు. సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా లక్షలాదిమంది ఉద్యోగులు రోడ్డుకెక్కడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. అసలు ఇలాంటిది ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా? అని సందేహం వ్యక్తం చేశారు. గర్జించాల్సిన సమయం వచ్చినప్పుడు మౌనంగా ఉండడం పిరికితనం అవుతుందంటూ ఏపీ ఉద్యోగులకు ఓ సలహా కూడా ఇచ్చారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News