Raviteja: 'ఖిలాడి' నుంచి యంగ్ విలన్ పోస్టర్!

Khiladi New Poster Released

  • యాక్షన్ ఎంటర్టైనర్ గా 'ఖిలాడి'
  • రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్లు 
  • కీలకమైన పాత్రలో అర్జున్ 
  • ఈ నెల 11వ తేదీన విడుదల 

రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' సినిమా రూపొందింది. సత్యనారాయణ కోనేరు నిర్మించిన ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ మరింత ఆసక్తిని పెంచుతూ వచ్చాయి. ఒక వైపున ఈ సినిమా నుంచి వరుసగా సింగిల్స్ వదులుతూనే, మరో వైపున ముఖ్యమైన పాత్రలను పరిచయం చేస్తూ కొత్త పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి మరో పాత్రను పరిచయం చేశారు. ఈ సినిమాలో అనూప్ సింగ్ యంగ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఆయన 'డేవిడ్' అనే పాత్రను పోషించాడని చెబుతూ, ఆయన లుక్ కి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. హిందీ సీరియల్స్ ద్వారా .. సినిమాల ద్వారా అనూప్ సింగ్ కి మంచి గుర్తింపు ఉంది.

ఆ మధ్య స్టార్ ప్లస్ లో వచ్చిన హిందీ 'మహాభారతం'లో ఆయన ధృతరాష్ట్రుడి పాత్రను పోషించాడు. ఆ పాత్ర ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టింది. మీనాక్షి చౌదరి .. డింపుల్ హయతి కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో, అర్జున్ .. ఉన్ని ముకుందన్ .. ముఖేశ్ రుషి .. రావు రమేశ్ .. అనసూయ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ నెల 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Raviteja
Meenakshi
Anoop Singh
Khiladi Movie
  • Loading...

More Telugu News