Sensex: మూడు రోజుల లాభాలకు బ్రేక్.. భారీగా నష్టపోయిన మార్కెట్లు!

Markets ends in losses

  • అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు
  • 770 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 219 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లలో మూడు రోజుల వరుస లాభాలకు ఈరోజు బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. దీంతో వారు ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమయినప్పటి నుంచి అమ్మకాలకే మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 770 పాయింట్లు నష్టపోయి 58,788కి పడిపోయింది. నిఫ్టీ 219 పాయింట్లు కోల్పోయి 17,560కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐటీసీ (1.14%), మారుతి సుజుకి (0.86%), టైటాన్ (0.46%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.05%), ఏసియన్ పెయింట్స్ (0.03%).

టాప్ లూజర్స్:
హెడ్చీఎఫ్సీ లిమిటెడ్ (-3.23%), ఇన్ఫోసిస్ (-2.76%), ఎల్ అండ్ టీ (-2.36%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.20%), బజాజ్ ఫైనాన్స్ (-1.88%).

  • Loading...

More Telugu News