Biren Singh: అది మణిపురి సంస్కృతి.. రాహుల్ జీ తెలుసుకోండి: ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ చురక

Manipuri tradition to remove shoes before entering homes

  • ఒకరి ఇంట్లోకి వెళ్లే ముందు పాదరక్షలు విడుస్తాం
  • ఇది పురాతన మణిపురి సంప్రదాయం
  • మణిపూర్ సంస్కృతి గురించి తెలుసుకోండి
  • రాహుల్ కు బిరేన్ సింగ్ సూచన

కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బిరేన్ సింగ్ స్పందించారు. కేంద్ర హోంశాఖ మంత్రిని కొన్ని రోజులు క్రితం ఢిల్లీలోని ఆయన నివాసంలో మణిపూర్ కు చెందిన నాయకుల బృందం కలుసుకుంది. ఇంట్లోకి ప్రవేశించే ముందు వారితో బలవంతంగా పాదరక్షలు ఇప్పించి అవమానించారంటూ రాహుల్ గాంధీ విమర్శలు కురిపించారు. తీరా లోపలికి వెళ్లిన తర్వాత అమిత్ షా పాదరక్షలతో ఉండడాన్ని వారు చూసినట్టు రాహుల్ పేర్కొన్నారు.

దీనిపై మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ స్పందిస్తూ.. దీనిని మణిపురి సంస్కృతిలో భాగంగా పేర్కొన్నారు. ‘‘ఎవరి ఇంట్లోకి అయినా అడుగు పెట్టే ముందు పాదరక్షలను బయట విడిచి వెళ్లడం అన్నది మణిపురి సంస్కృతిలో ఉన్న పురాతన సంప్రదాయం. దీనిని అవమానంగా ప్రచారం చేయడం అంటే వారు మణిపురి సంస్కృతిని పట్టించుకోకపోవడమే. మిస్టర్ రాహుల్ గాంధీ, మణిపూర్ గురించి మాట్లాడే ముందు మణిపురి సంస్కృతి గురించి కొంత తెలుసుకోండి’’ అంటూ బిరేన్ సింగ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News