chinna jiyar swamy: నిర్మాణానికి - వాస్తుకి మధ్య సంబంధం ఏంటి?.. చిన్నజీయర్ స్వామి చెప్పిన ఆసక్తికర పురాణగాథ

chinna jiyar swamy on vasthu

  • భృగు మహర్షికి బహ్మ ఇచ్చిన వరం
  • నిర్మాణాలు, అభివృధి పనులపై భృగు దృష్టి
  • అది తొలగిపోయేందుకు వాస్తు హోమం, శాంతి

వాస్తు పట్ల చాలా మందిలో ఎన్నో సందేహాలు వ్యక్తమవుతుంటాయి. కొందరిలో అపోహలు కనిపిస్తే.. వాస్తును పూర్తిగా విశ్వసించే వారు, అసలు పట్టించుకోని వారూ ఉన్నారు. రామానుజ సహస్రాబ్ది సమారోహం కార్యక్రమం సందర్భంగా త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి వారు వాస్తుపూజ, హోమాలు తదితర అంశాల విశిష్టతను భక్తులకు వివరించారు.

ముఖ్యంగా వాస్తు వెనుక ఉన్న కథను చిన్నజీయర్ స్వామి చెప్పగా, భక్తులు ఆసక్తిగా విన్నారు. ‘‘పురాణాల ప్రకారం స్వేదం నుంచి ఉద్భవించిన భృగు మహర్షి అనే అసురుడు దేవతలు, మనుషులను ఎన్నో ఇబ్బందులు పెట్టేవాడు. దీంతో అతడ్ని దేవతలు అణచివేయాలనుకున్నారు. ఆ సమయంలో భృగు మహర్షి బ్రహ్మ దేవుడిని ఆశ్రయించాడు. రక్షించాలని బ్రహ్మను వేడుకొన్నాడు.

‘ఏదైనా అభివృద్ధి చేసే వారిపై నీ దృష్టి ప్రభావం ఉంటుంది. నిన్ను శాంతింప జేస్తే బాధలు తొలగి సుఖం కలుగుతుంది’ అని వరమిచ్చారు. అందుకే ఏదైనా నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాల సమయంలో వాస్తు పురుషుడికి శాంతి, హోమం చేయడం ఆచారంగా ఏర్పడింది’’ అని చిన్నజీయర్ స్వామి వివరించారు.

  • Loading...

More Telugu News