pushpa Sreevani: ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి ఊరట!
- పుష్ప శ్రీవాణి కులంపై వివాదం
- హైకోర్టు ఆదేశాలతో విచారణ జరిపిన అప్పీలేట్ అథారిటీ
- ఆమె గిరిజనురాలేనని తేల్చిన అథారిటీ
ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి అప్పిలేట్ అథారిటీ ఊరటను కలిగించింది. ఆమె ఎస్టీనే అని అప్పిలేట్ అథారిటీ తెలిపింది. పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలయిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఆమె ఏ కులమో తేల్చాలంటూ అప్పిలేట్ అథారిటీని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో విచారణ చేపట్టిన అథారిటీ ఆమె గిరిజనురాలేనని నిర్ధారించింది. ఆమెది ఎస్టీకి చెందిన కొండదొర సామాజికవర్గమని పేర్కొంది. దీంతో ఆమెకు పెద్ద ఊరట లభించినట్టయింది.