Mohan Babu: 'సన్నాఫ్ ఇండియా' రిలీజ్ డేట్ ఖరారు!

Son of India release date confirmed

  • దేశభక్తి నేపథ్యంలో 'సన్నాఫ్ ఇండియా'
  • ఇళయరాజా సంగీతం ప్రత్యేకమైన ఆకర్షణ
  • కీలకమైన పాత్రలో శ్రీకాంత్
  • ఈ నెల 18వ తేదీన విడుదల  

మోహన్ బాబు కథానాయకుడిగా సినిమాలు తగ్గించుకుని కొంతకాలమవుతోంది. తనకి బాగా నచ్చిన కథలను .. పాత్రలను మాత్రమే ఆయన చేస్తూ వస్తున్నారు. అలా తాజాగా ఆయన సొంత బ్యానర్లో 'సన్నాఫ్ ఇండియా' సినిమా చేశారు. టైటిల్ ను బట్టే ఈ సినిమా దేశభక్తికి సంబంధించిన కంటెంట్ ను కలిగి ఉంటుందనేది అర్థమవుతూనే ఉంది.

దేశభక్తికి సంబంధించిన సినిమాల్లో మోహన్ బాబు డైలాగ్స్ మరింత పవర్ఫుల్ గా ఉంటాయని కూడా ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఇక డైలాగ్స్ రాయడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న డైమండ్ రత్నబాబు ఈ సినిమాకి దర్శకత్వం కూడా చేశాడు. ఇప్పటికే మోహన్ బాబు లుక్ కి మంచి మార్కులు పడిపోయాయి.

ఈ సినిమా విడుదలకు ముస్తాబై కొంతకాలమవుతోంది. కరోనా కారణంగా సరైన విడుదల సమయం కోసం ఎదురుచూస్తూ వచ్చిన ఈ సినిమా, ఈ నెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇళయరాజా సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది. శ్రీకాంత్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి..

Mohan Babu
Diamond Rathna Babu
Son of India Movie
  • Loading...

More Telugu News