Raviteja: రవితేజకి అత్తగా పవర్ఫుల్ పాత్రలో అనసూయ!

Khiladi movie update

  • సినిమాల్లో బిజీ అవుతున్న అనసూయ
  • 'పుష్ప' సినిమాతో మరింత క్రేజ్
  • 'ఖిలాడి'లో చంద్రకళగా డిఫరెంట్ రోల్
  • ఈ నెల 11వ తేదీన సినిమా విడుదల    

అనసూయ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆరంభంలో స్పెషల్ సాంగ్స్ పరంగా వినిపించిన అనసూయ పేరు .. ఇప్పుడు ముఖ్యమైన పాత్రల జాబితాలో కుదురుకుంటోంది. సాధ్యమైనంత వరకూ పవర్ఫుల్ పాత్రల్లో కనిపించడానికి ఆమె ఎక్కువగా ఆసక్తిని చూపుతోంది. దర్శక నిర్మాతలు కూడా ఆమెను ఆ విధంగా చూపించడానికే ప్రాధాన్యతనిస్తున్నారు.

'పుష్ప' సినిమాలో గ్లామర్ కి కాస్త దూరంగా 'దాక్షాయణి' అనే మాస్ పాత్రలో ఆమె కనిపించింది. కానీ ఈ సారి గ్లామరస్ గా కనిపిస్తూనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనుందని అంటున్నారు .. అదీ రవితేజ సినిమాలో. రవితేజ కథానాయకుడిగా రూపొందిన 'ఖిలాడి' సినిమాలో మీనాక్షి చౌదరి .. డింపుల్ హయతి ఇద్దరు కథానాయికలు ఉన్నారు.

ఆ ఇద్దరిలో ఒకరికి తల్లిగా .. అంటే రవితేజకి అత్త పాత్రలో అనసూయ తన జోరు చూపించనుందని అంటున్నారు. ఆమె పోషించిన 'చంద్రకళ' పాత్ర ఈ సినిమాకి హైలైట్ అవుతుందని చెబుతున్నారు. రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 11వ తేదీన విడుదల చేయనున్నారు.

Raviteja
Meenakshi
Dimple
Anasuya
Khiladi Movie
  • Loading...

More Telugu News