Buggana Rajendranath: వీటి గురించి బడ్జెట్‌లో కనీసం ప్రస్తావించకపోవడం స‌రికాదు: ఏపీ మంత్రి బుగ్గ‌న‌

buggana slams nda govt

  • కేంద్ర బ‌డ్జెట్‌లో ఏపీకి అన్యాయం
  • ప్రత్యేక హోదా, పోలవరంపై మాట్లాడ‌లేదు
  • మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమల‌పై ప్రస్తావించలేదన్న మంత్రి  

కేంద్ర బ‌డ్జెట్‌లో ఏపీకి అన్యాయం జ‌రిగింద‌ని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమ‌ర్శ‌లు గుప్పించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను విస్మరించడం తీవ్ర నిరాశపరిచిందని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం, మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమలు వంటి వాటిని బడ్జెట్‌లో కనీసం ప్రస్తావించకపోవడం స‌రికాద‌ని చెప్పారు.

కరోనా వేళ‌ తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర స‌ర్కారు నుంచి భారీగా నిధుల కేటాయింపు జ‌రిగితే బాగుండేద‌ని ఆయ‌న అన్నారు. రుణ సేకరణకు పరిమితులు పెంచాల్సింద‌ని, రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదపడేదని చెప్పారు.

జాతీయ ఉపాధి హామీ పథకంతో పాటు ఎరువులు, ఆహార సబ్సిడీ తదితర వాటిలో రాష్ట్రాలకు కేంద్రం కోత విధించిందని బుగ్గ‌న తెలిపారు. జల జీవన్‌ మిషన్, జాతీయ విద్యా మిషన్, జాతీయ ఆరోగ్య మిషన్‌ తదితర ప్రాజెక్టులకు నిధులు పెంచినప్పటికీ ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా అవి ఏమాత్రం చాలవన్నారు. రక్షణ రంగానికి, రైల్వేలకు కేటాయింపులు పెంచ‌డం మాత్రం సానుకూల పరిణామమని చెప్పారు.

Buggana Rajendranath
NDA
Andhra Pradesh
  • Loading...

More Telugu News