WhatsApp: నిబంధనలు ఉల్లంఘిస్తే వేటే.. 20 లక్షల భారతీయుల వాట్సాప్ ఖాతాలు బ్లాక్
- డిసెంబర్ నెలలో చర్యలు
- యూజర్ల నుంచి ఫిర్యాదులు
- నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తింపు
- నెలవారీ నివేదిక విడుదల
నిబంధనలను పాటించని యూజర్ల ఖాతాలపై వాట్సాప్ ఉక్కుపాదం మోపుతోంది. 2020 నవంబర్ నెలలో 17 లక్షల భారతీయుల వాట్సాప్ ఖాతాలను బ్లాక్ చేసిన సంస్థ.. డిసెంబర్ నెలలో మరో 20,79,000 ఖాతాలపైనా ఇదే మాదిరి చర్య తీసుకుంది. డిసెంబర్ నెలకు సంబంధించిన నివేదికను విడుదల చేసింది.
ఐటీ చట్టం 2021 కింద నెలవారీ నివేదికలను సామాజిక మాధ్యమ సంస్థలు వెల్లడించాల్సి ఉంటుంది. యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ ఖాతాలను బ్లాక్ చేసినట్టు వాట్సాప్ తెలిపింది. భారతీయ చట్టాలు లేదా వాట్సాప్ నియమ, నిబంధనలు ఉల్లంఘించిన ఖాతాలపై చర్యలు ఉంటాయని తెలిపింది.
డిసెంబర్ నెలకు 528 ఫిర్యాదుల నివేదికలను అందుకున్నట్టు తెలిపింది. ‘రిపోర్ట్’ ఫీచర్ ద్వారా యూజర్ల నుంచి అందిన నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ఆధారంగాను చర్యలు తీసుకున్నట్టు వాట్సాప్ పేర్కొంది. మరింత పారదర్శకతకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించింది.