Rajasekhar: 'శేఖర్' సెకండ్ సింగిల్ కి ముహూర్తం ఖరారు!

Shekar movie update

  • విభిన్న కథా చిత్రంగా 'శేఖర్'
  • కథానాయకుడిగా రాజశేఖర్
  • మలయాళ 'జోసెఫ్'కి రీమేక్
  • ఈ నెల 4న సెకండ్ సింగిల్

రాజశేఖర్ కథానాయకుడిగా జీవిత దర్శకత్వంలో 'శేఖర్' సినిమా రూపొందింది. ఈ సినిమాకి రాజశేఖర్ కూడా ఒక నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో ఆయన కూతురు పాత్రను శివాని పోషించడం విశేషం. ఈ నెల 4వ తేదీన రాజశేఖర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారుగానీ కుదరలేదు.

అందువలన ఆ రోజు ఉదయం 10 గంటలకు ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని కొంతసేపటి క్రితం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో ఆత్మీయరాజన్ .. ముస్కాన్ కథానాయికలుగా కనిపించనున్నారు.

మలయాళంలో కొంతకాలం క్రితం వచ్చిన 'జోసెఫ్' సినిమాకి ఇది రీమేక్. అక్కడ హీరోగా జోజు జార్జ్ నటించగా పద్మాకర్ దర్శకత్వం వహించాడు. రిటైర్మెంట్ తీసుకున్న ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో చోటుచేసుకునే అనూహ్యమైన సంఘటనల సమాహారంగా ఈ కథ నడుస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..

Rajasekhar
Muskan
Aathmeeya Rajan
Shekar Movie
  • Loading...

More Telugu News