Raviteja: 'రామారావు ఆన్ డ్యూటీ' రిలీజ్ డేట్ ప్రకటన ఇదే!

Ramarao On Duty movie update

  • 'ఖిలాడి'గా రవితేజ
  • ఈ నెల 11వ తేదీన రిలీజ్
  • 'రామారావు ఆన్ డ్యూటీ' కూడా రంగంలోకి
  • మార్చి 25న గానీ, ఏప్రిల్ 15న గాని విడుదల

రవితేజ కథానాయకుడిగా 'రామారావు ఆన్ డ్యూటీ' రూపొందుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి, రవితేజ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. శరత్ మండవ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది.

ఈ సినిమాను మార్చి 25వ తేదీన విడుదల చేయనున్నట్టు కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. అయితే ఇప్పుడు మేకర్స్ నిర్ణయంలో మార్పు జరిగే అవకాశం ఉన్నట్టుగా అర్థమవుతోంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల కారణంగా తమ సినిమా మార్చి 25వ తేదీన గానీ .. ఏప్రిల్ 15వ తేదీన గాని విడుదల కావొచ్చని వారు చెప్పారు.

దివ్యాన్ష .. రజీషా విజయన్ కథానాయికలుగా అలరించనున్న ఈ సినిమాలో, నాజర్ .. నరేశ్ .. తనికెళ్ల భరణి .. పవిత్ర లోకేశ్ .. ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇక రవితేజ నటించిన 'ఖిలాడి' ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలోను ఇద్దరు హీరోయిన్లు సందడి చేయనున్నారు.

Raviteja
Divyansha Koushik
Rajeesha Vijayan
Ramarao on Duty Movie
  • Loading...

More Telugu News