RBI: ముందు రాజధాని ఎక్కడో నిర్ణయించనివ్వండి.. ఆ తర్వాత చూద్దాం: ఏపీలో కార్యాలయ ఏర్పాటుపై ఆర్‌బీఐ

RBI Responds Over Office Establishment in AP
  • కార్యాలయం ఏర్పాటు చేయాలంటూ గతేడాది అక్టోబరులో జాస్తి వీరాంజనేయుల లేఖ
  • తాజాగా బదులిచ్చిన ఆర్‌బీఐ డిప్యూటీ మేనేజర్
  • రాష్ట్రంలో 104 కరెన్సీ పెట్టెలు ఉన్నాయన్న సుభాశ్రీ
ఆంధ్రప్రదేశ్‌లో రిజర్వు బ్యాంకు కార్యాలయం ఏర్పాటు చేయాలంటూ అమరావతి అభివృద్ధి సంస్థ చైర్మన్, అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు గతేడాది అక్టోబరు 12న రాసిన లేఖపై ఆర్‌బీఐ స్పందించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడో ప్రభుత్వం నిర్ణయించిన తర్వాతే కార్యాలయం ఏర్పాటు చేస్తామని ఆర్‌బీఐ డిప్యూటీ మేనేజర్ ఎంకే సుభాశ్రీ ఓ లేఖలో బదులిచ్చారు.

అలాగే, నగదు నిల్వలు, సరఫరాకు సంబంధించిన పెట్టెల విషయాన్ని కూడా ఆ లేఖలో ప్రస్తావించారు. ఏపీలో ప్రస్తుతం 104 కరెన్సీ పెట్టెలు ఉన్నాయని తెలిపారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహించే రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ, భద్రత కమిటీల సమావేశాల్లో పెట్టెల కొరతకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని సుభాశ్రీ ఆ లేఖలో వివరించారు.
RBI
Andhra Pradesh
Amaravati

More Telugu News