Nagoba Jatara: ప్రారంభమైన ఆదివాసీల నాగోబా జాతర.. మర్రిచెట్టు నీడన సేదదీరిన మెస్రం వంశీయులు

Nagoba Jatara Begins in Adilabad district

  • సమ్మక్క-సారలమ్మ జాతర తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన నాగోబా జాతర
  • నాగోబా విగ్రహాన్ని తలపై మోసుకొచ్చిన మెస్రం ధర్ము
  • మహాపూజకు హాజరైన పలువురు ప్రజా ప్రతినిధులు

తెలంగాణలో సమ్మక్క-సారలమ్మ జాతర తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన గిరిజనుల జాతరగా ఖ్యాతికెక్కిన నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లాలో కేస్లాపూర్‌లో గత అర్ధరాత్రి ఘనంగా ప్రారంభమైంది. ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకటరావు ఆధ్వర్యంలో సంప్రదాయ పూజలతో జాతరను ప్రారంభించారు. నాగోబా విగ్రహాన్ని నాయక్‌వాడి మెస్రం ధర్ము తలపై ఎత్తుకుని ఆలయానికి తీసుకొచ్చారు. మెస్రం వంశ ఆడపడుచులు ఆలయ ఆవరణలో మట్టితో పుట్టలు తయారుచేశారు.

దాదాపు గంటపాటు మెస్రం వంశీయుల సమక్షంలో పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయం ప్రకారం మెస్రం వంశీయులు మర్రిచెట్టు నీడన సేదదీరారు. భక్తులపై మెస్రం వంశస్థులు పవిత్ర జలాలను చల్లారు.

ఐదు రోజులపాటు జాతర కొనసాగుతుంది. మూడో తేదీన మండగాజిలి పూజ, 4న ఖేతాల్ పూజ నిర్వహిస్తారు. గత రాత్రి జరిగిన మహాపూజకు ఎమ్మెల్యేలు రేఖానాయక్, ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ దండే విఠల్, జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, కలెక్టర్ సక్తా పట్నాయక్, ఎస్పీ ఉదయ్ కుమార్‌రెడ్డి హాజరయ్యారు.

  • Loading...

More Telugu News