Raviteja: రవితేజ సినిమాలో మెరవనున్న ఇలియానా?

Iliana in Raviteja movie

  • తెలుగు సినిమాలకి దూరమైన ఇలియానా
  • 'రామారావు ఆన్ డ్యూటీ'లో స్పెషల్ సాంగ్
  • త్వరలోనే రానున్న క్లారిటీ

తెలుగులో ఇలియానాకి మంచి క్రేజ్ ఉంది. 'పోకిరి' .. 'జల్సా' .. 'జులాయి' .. 'కిక్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల కారణంగా ఆమెను ఇక్కడి ప్రేక్షకులు మరచిపోలేకపోతున్నారు. ఆమె బాలీవుడ్ సినిమాలపై గల క్రేజ్ తో అక్కడ ఎక్కువగా ఫోకస్ చేసే పనిలో, ఇక్కడి అవకాశాలను పోగొట్టుకుంది. ఆ తరువాత ఆమె వెనక్కి వచ్చినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.

అలాంటి ఇలియానా రవితేజ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. రవితేజ హీరోగా 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా రూపొందుతోంది. శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్ .. రజీషా విజయన్ కథానాయికలుగా అలరించనున్నారు.

ఈ సినిమాలో ఒక మాస్ మసాలా సాంగ్ ఉండటంతో, ఇలియానాతో చేయిస్తే బాగుంటుందని రవితేజ అన్నట్టుగా చెప్పుకుంటున్నారు. రవితేజ - ఇలియానా మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇద్దరి కాంబినేషన్లో నాలుగు సినిమాలు వచ్చాయి. ఆ పరిచయంతోనే ఆయన సిఫార్స్ చేసినట్టుగా టాక్. మరి ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి.

Raviteja
Divyansha Koushik
Sharath Mandava Movie
  • Loading...

More Telugu News