Rajasekhar: గోపీచంద్ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న రాజశేఖర్?

Gopichand movie update

  • విలన్ పాత్రల పట్ల రాజశేఖర్ ఆసక్తి 
  • గోపీచంద్ మూవీలో పవర్ఫుల్ విలన్ రోల్ 
  • శ్రీవాస్ దర్శకత్వంలో సెట్స్ పైకి 
  • రాజశేఖర్ ప్లేస్ లో జగపతిబాబు?

రాజశేఖర్ చాలా కాలం నుంచి కూడా తాను విలన్ పాత్రలు చేయడానికి సిద్ధంగానే ఉన్నాననే సంకేతాలనిస్తూ వస్తున్నారు. గతంలో ఒకటి రెండు సినిమాల్లో ఆయన విలన్ గా చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వలన, ఆ ప్రాజెక్టులు కార్యరూపాన్ని దాల్చలేదు. అభిమానులు కూడా ఆయన విలన్ రోల్స్ కి సెట్ అవుతారనే అనుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో గోపీచంద్ హీరోగా శ్రీవాస్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో విలన్ పాత్రలో రాజశేఖర్ చేస్తున్నట్టుగా చెప్పారు. ఇప్పుడేమో ఈ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకున్నారని అంటున్నారు. కారణమేమిటనేది తెలియదుగానీ, ఈ వార్త మాత్రం జోరుగానే వినిపిస్తోంది.
 
గోపీచంద్ తో 'లక్ష్యం' .. 'లౌక్యం' తరువాత శ్రీవాస్ చేస్తున్న సినిమా ఇది. ఆ రెండు సినిమాలు సూపర్ హిట్లు కావడం వలన, ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా నుంచి రాజశేఖర్ తప్పుకోవడం వలన, జగపతిబాబును తీసుకునే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Rajasekhar
Gopichand
Sriwass Movie
  • Loading...

More Telugu News