Disha Rape: సుప్రీంకోర్టుకు చేరిన 'దిశ ఎన్ కౌంటర్' విచారణ కమిషన్ నివేదిక!

Disha encounter report reaches to Supreme Court

  • దేశ వ్యాప్తంగా కలకలం రేపిన దిశ హత్యాచారం, ఎన్ కౌంటర్
  • ఎన్ కౌంటర్ పై సిర్పూర్కర్ కమిషన్ ను నియమించిన సుప్రీంకోర్టు
  • 2019లో విచారణ ప్రారంభించిన కమిషన్

హైదరాబాద్ నగర శివార్లలో జరిగిన దిశ హత్యాచారం, అనంతరం నిందితులు పోలీస్ ఎన్ కౌంటర్ లో మరణించడం.. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది. విచారణ కోసం సిర్పూర్కర్ కమిషన్ ను నియమించింది. తాజాగా కమిషన్ తన నివేదికను సుప్రీంకోర్టుకు అందజేసింది.

విచారణలో భాగంగా ఫోరెన్సిక్ నివేదికలు, పోస్టు మార్టం నివేదికలు, ఫొటోలు, వీడియోలను కమిషన్ సేకరించింది. 19-2019 క్రైమ్ నంబర్ 784లో నిందితులుగా ఉన్న జొల్లు శివ, నవీన్, చింతకుంటల చెన్నకేశవులు, మహ్మద్ ఆరిఫ్ ల ఎన్ కౌంటర్ పై విచారణ పూర్తి చేసింది. 2019లో ఈ కమిషన్ విచారణ చేసింది. అయితే, కరోనా కారణంగా విచారణ ఆలస్యమయిందని సుప్రీంకోర్టుకు కమిషన్ తెలిపింది.

Disha Rape
Encounter
Supreme Court
  • Loading...

More Telugu News