Raviteja: నల్లగా ఉన్నాననే విమర్శలు బాధపెట్టాయి: డింపుల్ హయతి

Khiladi movie update

  • నేను కొంచెం రంగు తక్కువ
  • అందుకే అంత త్వరగా అవకాశాలు రాలేదు
  • తిరస్కారాలు ఎదురైన సందర్భాలు ఎక్కువ
  • ఐటమ్ సాంగ్స్ చేయకూడదనుకున్నాను
  • 'ఖిలాడి'పై నమ్మకముందున్న డింపుల్ హయతి

తెలుగు తెరపై ఓ సావిత్రి .. ఓ వాణిశ్రీ .. ఓ భానుప్రియ కథానాయికలుగా ఒక వెలుగు వెలిగారు. స్టార్ హీరోయిన్స్ గా తిరుగులేని కెరియర్ ను కొనసాగించారు. సాధారణంగా హీరోయిన్స్ తెల్లగా ఉంటేనే ఆడియన్స్ ఎక్కువగా లైక్ చేస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా రంగు తక్కువగా ఉన్నప్పటికీ, అది ఒక సమస్య కాదనే వాళ్లంతా నిరూపించారు.

కానీ కాస్త రంగు తక్కువగా ఉండటం వలన తాను చాలా అవమానాలను ఫేస్ చేసినట్టుగా డింపుల్ హయతి చెబుతోంది. "నిజంగానే నేను కాస్త రంగు తక్కువ. అందువలన అవకాశాల కోసం ఎక్కడికి వెళ్లినా తిరస్కారాలే ఎదురయ్యేవి. నేను చాలా నల్లగా ఉన్నాననే కామెంట్లు నా వెనుకే వినిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లోనే 'గద్దలకొండ గణేశ్' సినిమాలో 'జర్రా జర్రా' అనే ఐటమ్ సాంగ్ చేశాను.

ఆ తరువాత అందరూ కూడా ఐటమ్ సాంగ్స్ కోసమే అడగడం మొదలుపెట్టారు. అందువల్లనే ఇక ఆ వైపు వెళ్లకూడదని భావించి, హీరోయిన్ గానే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అలాంటి అవకాశం కోసమే ఎదురుచూశాను. అలాంటి సమయంలోనే నాకు 'ఖిలాడి' సినిమాలో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది.

నిజంగా ఇది నాకు దక్కిన పెద్ద అవకాశంగా నేను భావిస్తున్నాను., రవితేజ సరసన చేసే అవకాశం రావడం గొప్ప విషయం. ఇక నన్ను నేను నిరూపించుకునే సమయం వచ్చేసింది" అంటూ చెప్పుకొచ్చింది. వచ్చేనెల 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Raviteja
Dimple Hayathi
Khiladi Movie
  • Loading...

More Telugu News