Anitha: ఏపీ మంత్రులు మనుషులా? కాలకేయులా?: వంగలపూడి అనిత

anita slams ycp

  • ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు
  • మద్యపాన నిషేధంపై హామీ నెర‌వేర్చ‌ట్లేదు
  • నిత్యావసరాల ధరలు పెరిగాయంటున్న అనిత 
  • టీడీపీ మ‌హిళా నేత‌ల‌తో కలిసి దీక్ష‌ 

టీడీపీ నాయ‌కురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో ఈ రోజు ఉద‌యం అమరావతిలోని ఎన్టీఆర్ భ‌వ‌న్‌లో టీడీపీ నారీ సంకల్ప దీక్ష ప్రారంభ‌మైంది. ఏపీలో మహిళలపై జ‌రుగుతోన్న‌ అఘాయిత్యాలతో పాటు మద్యపాన నిషేధంపై సీఎం జ‌గ‌న్ ఇచ్చిన హామీని నెర‌వేర్చ‌క‌పోవ‌డం, నిత్యావసరాల ధరల పెంపు వంటి అంశాల‌పై నిరసనగా తెలుగు మహిళ రాష్ట్ర కమిటీ సభ్యులు ఈ దీక్ష చేప‌ట్టారు.

అమ్మాయిల‌తో క్యాసినో నిర్వహించిన ఏపీ మంత్రులు మనుషులా? కాలకేయులా? అని ఈ సంద‌ర్భంగా వంగలపూడి అనిత విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌లో ఏపీలో మ‌హిళ‌ల‌పై దాడులు పెరిగిపోయాయ‌ని ఆరోపించారు. ఇటువంటి అఘాయిత్యాల‌కు వ్య‌తిరేకంగా తాము ఈ రోజు నిరసన దీక్షకు కూర్చున్నట్లు తెలిపారు. రాష్ట్ర‌ మహిళల్లో  ధైర్యం నింపుతామ‌ని చెప్పారు. ఏపీలో పొదుపు సంఘాల డబ్బులు కూడా ప్ర‌భుత్వం కొట్టేస్తోంద‌ని ఆమె ఆరోపించారు. సీఎం జగన్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైందని అనిత అన్నారు.

Anitha
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News