Assam Girl: మూడేళ్ల అసోం బాలికతో ఏనుగు ఫుట్ బాల్ ఆట.. వీడియో ఇదిగో!

Assam Girl Plays Football With Elephant Tries To Drink Milk

  • ఏనుగు నుంచి పాలు తాగే ప్రయత్నం
  • స్నేహంగా మసలుకుంటున్న ఏనుగు
  • అసోంలోని గోలాఘాట్ జిల్లాలో ఘటన

మూడేళ్ల చిన్నారి ఏనుగుతో కలివిడిగా ఉండటం చూసేవారిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అసోంలోని గోలాఘాట్ జిల్లాకు చెందిన మూడేళ్ల బోర అనే బాలిక కుటుంబం ఏనుగు సంరక్షణ బాధ్యతల్లో ఉంది. దీంతో ఏనుగుతో అప్పుడప్పుడు ఫుట్ బాల్ ఆడుకోవడం ఈ చిన్నారికి సాధారణంగా మారిపోయింది.

 ఫుట్ బాల్ ఆడుతున్న సమయంలో చిన్నారి కోపంతో ఏనుగు తొండాన్ని కాలుతో తన్నినా, ఆ ఏనుగుకు కోపం రాకపోవడాన్ని గమనించొచ్చు. ఏనుగు అంటే అసలేమాత్రం భయం లేకుండా ఆ చిన్నారి మసలుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

అంతేకాదు, ఆ చిన్నారి ఏనుగు నుంచి పాలు తాగే ప్రయత్నం కూడా చేసింది. తమ పెద్ద వారి సూచన మేరకు చిన్నారి ఏనుగు పాలు తాగాలనుకోగా, ఎత్తు చాలక ఇబ్బంది పడడాన్ని ఇక్కడి వీడియోలో చూడొచ్చు. ఇందుకు సంబంధించిన వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News