Chiranjeevi: అందమైన సూర్యోదయాన్ని వీడియోలో బంధించిన చిరంజీవి

Chiranjeevi captures sunrise beautifully
  • మరోసారి కెమెరాకు పనిచెప్పిన మెగాస్టార్
  • బాలభానుడి విన్యాసాలతో వీడియో
  • తన భావుకతను చాటిన వైనం
  • ఇన్ స్టాగ్రామ్ లో వీడియో
మెగాస్టార్ చిరంజీవిలో అద్భుతమైన నటుడే కాదు మంచి భావుకుడు కూడా ఉన్నాడు. అప్పుడప్పుడు ఆయన ప్రకృతిని తన కెమెరాలో బంధిస్తూ అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా సూర్యోదయాన్ని ఎంతో రమణీయంగా వీడియో రూపంలో చిత్రీకరించారు. చీకట్లను చీల్చుకుని బాలభానుడు పైపైకి వస్తున్న దృశ్యాలను ఆ వీడియోలో చూసి తీరాల్సిందే. కాగా, తన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్న చిరు, తన మనోభావాలను కూడా వ్యక్తం చేశారు.

"నేటి ఉదయం లేవగానే కనిపించిన అందమైన ఆకాశాన్ని కెమెరాలో బంధించి మీతో పంచుకోవాలనిపించింది. ఒక మూలగా ఉన్న నెలవంక, దానికి దగ్గర్లోనే శుక్ర గ్రహం, ఉదయించబోతున్న సూర్యుడు... ఆ కొంటె సూర్యుడ్ని చూడలేక నెలవంక సిగ్గుతో పక్కకు తొలగినట్టుగా ఉంది" అంటూ భావయుక్తంగా వ్యాఖ్యానించారు.
Chiranjeevi
Sunrise
Video
Morning
Instagram
Tollywood

More Telugu News