Dil Raju: లైఫ్ మార్చేయడానికి ఒక్క సినిమా చాలు: దిల్ రాజు

 Dil Raju speaks about Rowdy Boys movie

  • 'రౌడీ బాయ్స్' హిట్ కిందే లెక్క
  • ఆశిష్ ప్రూవ్ చేసుకున్నాడు
  • యూత్ ఆయన్ని రిసీవ్ చేసుకుంది
  • అన్ని జోనర్లలో నిరూపించుకోవాలన్న దిల్ రాజు

దిల్ రాజు తన సోదరుడి తనయుడైన ఆశిష్ హీరోగా 'రౌడీ బాయ్స్' సినిమాను నిర్మించారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన విషయాలను గురించి తాజా ప్రెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడారు. 'రౌడీ బాయ్స్' సినిమా ఫస్టు వీక్ లో 8.5 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. సెకండ్ వీక్ లో 3.98 కోట్ల గ్రాస్ ను రాబట్టింది.

యూత్ ఈ సినిమాను ఓన్ చేసుకోవడం వల్లనే ఈ స్థాయి వసూళ్లను రాబట్టింది. ఇంతవరకూ 12 కోట్లకు పైగా రాబట్టిన ఈ సినిమా, మరో రెండు రోజుల్లో రెండు కోట్లు రాబట్టే అవకాశం ఉంది. ఒక కొత్త హీరోపై ఈ మాత్రం వసూళ్లు వస్తే సూపర్ హిట్ కిందే అనుకోవాలి. అనుకున్నట్టుగానే రీచ్ అయింది కనుక, ఆశిష్ ప్రూవ్ చేసుకున్నట్టే.

నేను ఎప్పుడూ ఆశిష్ ను ఒక ఆర్టిస్టుగానే ఎదగమని చెబుతుంటాను. ఒక హీరో నిలబడాలంటే యూత్ కీ .. మాస్ కీ .. ఫ్యామిలీ ఆడియన్స్ కి సెట్ కావాలి .. ఆ జోనర్ కథల్లో ఫిట్ అనిపించుకోవాలి. బన్నీకి 'గంగోత్రి' తరువాత 'ఆర్య' అనే సినిమా తగిలింది. ఆ సినిమా మా లైఫ్ ని మార్చేసింది. అలాంటి ఒక సినిమా ఆశిష్ కి తగలాలి. అది ప్లాన్ చేయలేం .. అనుకోకుండా రావలసిందే" అని చెప్పుకొచ్చారు.

Dil Raju
Ashish
Allu Arjun
  • Loading...

More Telugu News