Komatireddy Venkat Reddy: ఉస్మానియా వర్సిటీలో క్రికెట్ టోర్నీ నిర్వహించడానికి సిగ్గుండాలి: టీఆర్ఎస్ పై కోమటిరెడ్డి వ్యాఖ్యలు

Komatireddy fires on TRS Party

  • కేసీఆర్ పేరుమీద టోర్నమెంట్
  • మండిపడిన కోమటిరెడ్డి
  • ఓవైపు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని వ్యాఖ్య  

టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడానికి టీఆర్ఎస్ పార్టీ వారికి సిగ్గుండాలని వ్యాఖ్యానించారు. ఓవైపున కేసీఆర్ నియంతృత్వ పోకడలతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, కేసీఆర్ పేరుమీద ఉస్మానియా వర్సిటీలో టీఆర్ఎస్ నేతలు టోర్నీ పెట్టారని మండిపడ్డారు. కేసీఆర్ కు పోయే కాలం దగ్గర పడిందని కోమటిరెడ్డి శాపనార్థాలు పెట్టారు.

కాగా, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగి ముత్యాల సాగర్ కుటుంబాన్ని నిన్న పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుద్యోగులు ఎవరూ తొందరపడి బలవన్మరణాలకు పాల్పడవద్దని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. "రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి... ఇది నీకు న్యాయమేనా? నీకు కూడా బిడ్డలు ఉన్నారు... నిరుద్యోగుల గురించి ఒక్కసారి ఆలోచించాలి" అని హితవు పలికారు.

Komatireddy Venkat Reddy
TRS
Cricket Tournament
Osmania University
  • Loading...

More Telugu News