Allu Arjun: అల్లు అర్జున్ ను సర్ ప్రైజ్ చేసిన పర్సనల్ టీమ్

AA Team surprised Allu Arjun

  • బ్లాక్ బస్టర్ హిట్టయిన పుష్ప
  • వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్లు
  • అల్లు అర్జున్ కార్యాలయంలో సంబరాలు
  • సంభ్రమాశ్చర్యాలకు లోనైన బన్నీ

పుష్ప చిత్రంతో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయస్థాయిలో ప్రజాదరణ సొంతం చేసుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప గత డిసెంబరు 17న రిలీజ్ కాగా, వరల్డ్ వైడ్ కలెక్షన్ల మోత మోగించింది. బాలీవుడ్ లోనూ బన్నీ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. పుష్ప విజయంతో అల్లు అర్జున్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, అల్లు అర్జున్ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు.

ఈ కార్యక్రమానికి హాజరైన అల్లు అర్జున్ ను ఆయన పర్సనల్ టీమ్ ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది. సిబ్బంది ఆయన కార్యాలయాన్ని ఎర్రచందనం దుంగలను పోలిన దుంగలు, గొడ్డలి, పుష్ప కటౌట్ తో నింపేశారు. అంతేకాదు, పుష్ప చిత్రానికి సంబంధించిన అంశాలతో ఓ కేక్ ను కూడా సిద్ధం చేశారు. దాని పక్కనే గొడ్డలి, చాకు, కొడవలిని కూడా ఉంచారు. ఆఫీసు గదిలోకి రాగానే ఆ సెటప్ అంతా చూసి బన్నీ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.

తన 'ఏఏ' ఫ్యామిలీ నిజంగానే విస్మయానికి గురిచేసిందని, వారి ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అల్లు అర్జున్ దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తగ్గేదే లే అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు.

Allu Arjun
AA Family
Office
Pushpa
Tollywood
  • Loading...

More Telugu News