Mother Hen: తన గుడ్లను కాపాడుకోవడానికి నల్లత్రాచుతో తల్లి కోడి యుద్ధం.. చివరకు ఏం జరిగిందంటే?.. వీడియో వైరల్!

Mother hen fights with cobra to save her eggs Viral video

  • గుడ్లను పొదుగుతుండగా అక్కడకు వచ్చిన నల్లత్రాచు
  • కాటు వేయడానికి పాము ప్రయత్నించగా.. దాని పడగపై దాడి చేసిన కోడి
  • చివరకు అక్కడ నుంచి జారుకున్న పాము

ప్రపంచంలో అన్నింటికంటే గొప్పది మాతృత్వం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి తల్లులు తమ ప్రాణాలను సైతం పణంగా పెడతారు. అది మనిషైనా, జంతువైనా, పక్షి అయినా తల్లి మనసు మాత్రం ఒక్కటే. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. తాను పొదుగుతున్న గుడ్లను కాపాడుకోవడానికి తల్లి కోడి ఏకంగా నల్లత్రాచుతోనే పోరాడింది.

అసలేం జరిగిందంటే... ఒక తల్లి కోడి తన గుడ్లను పొదుగుతోంది. ఇంతలోనే ఓ నల్లత్రాచు అక్కడకు వచ్చింది. గుడ్లను తినేందుకు యత్నించింది. అయితే, తల్లి కోడి మాత్రం ఏమాత్రం భయపడలేదు. తన గుడ్లను సంరక్షించుకునే క్రమంలో కనీసం ఒక ఇంచు కూడా పక్కకు జరగలేదు. అంతేకాదు, పడగవిప్పి బుసలు కొడుతున్న త్రాచు కళ్లలోకి కళ్లు పెట్టి చాలా తీక్షణంగా చూసింది.

ఇంతలోనే ఆ కోడిని కాటు వేసేందుకు పాము ప్రయత్నించగా... దాని పడగపై కోడి దాడి చేసింది. పాము, కోడి ఫైట్ ఉత్కంఠభరితంగా సాగింది. కోడి పట్టుదలను, సాహసాన్ని చూసి పాము చివరకు తోకముడిచి, అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ కోడి అమ్మ మనసుకు, ధైర్యానికి నెటిజెన్లు ఫిదా అయిపోతున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News