Keerthi Suresh: అవమానాలను దాటుకునే వచ్చాను: కీర్తి సురేశ్

Good Luck Sakhi movie update

  • కెరియర్ ఆరంభంలోనే కష్టాలు
  • ఆగిపోయిన ప్రాజెక్టులు
  • ఐరన్ లెగ్ అంటూ ప్రచారం
  • కష్టమే సక్సెస్ ను తెస్తుందన్న కీర్తి సురేశ్  

కీర్తి సురేశ్ కి తెలుగు .. తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. బలమైన సినిమా నేపథ్యం నుంచి వచ్చింది గనుక, వెంటనే ఆమె స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుందని అంతా అనుకుంటారు. కానీ తన కెరియర్ ఆరంభంలో తాను చాలా అవమానాలను ఎదుర్కొన్నానని కీర్తి సురేశ్ చెబుతోంది. ఆ విషయాలను గురించి ఆమె ఇలా ప్రస్తావించింది.

"మలయాళంలో నేను చేసిన ఒక సినిమా విడుదలకి నోచుకోలేదు. ఆ తరువాత రెండు సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. దాంతో నాది ఐరన్ లెగ్ అనే ప్రచారం జరగడం మొదలైంది. ఆ తరువాత నాకు అవకాశాలు పోయాయి .. అవమానాలు ఎదురయ్యాయి. ఆ ప్రచారం నుంచి నేను బయటపడటానికి మూడేళ్లు పట్టింది.

కెరియర్లో సక్సెస్ రావాలంటే ఎంతో కష్టపడాలి. అలా కష్టపడటం వలన తప్పకుండా సక్సెస్ అవుతాము. సక్సెస్ మాత్రమే అవమానాలను ప్రశంసలుగా మార్చగలదని నేను భావించాను. ఆ దిశగానే నా పనిని నేను సిన్సియర్ గా చేస్తూ వెళ్లాను. చివరికి ఇదిగో ఈ స్థాయికి చేరుకున్నాను" అంటూ చెప్పుకొచ్చింది. ఆమె తాజా చిత్రమైన 'గుడ్ లక్ సఖి' ఈ రోజునే థియేటర్లకు వచ్చింది.

Keerthi Suresh
Jagapathi Babu
Adi Pinishetty
Good luck Sakhi Movie
  • Loading...

More Telugu News