Sri Vishnu: లంచం లేనిదే కంచంలో అన్నం కూడా దొరకట్లేదు.. ఇదిగో శ్రీవిష్ణు ‘భళాతందనాన’ సినిమా టీజర్

Sri Vishnu Bhala Tandanana Teaser Out
  • సొసైటీని తాకేట్టున్న డైలాగ్ లు
  • చైతన్య దంతులూరి డైరెక్షన్ లో సినిమా
  • ఆకట్టుకునేలా మణిశర్మ బీజీఎం
‘రాక్షసుడిని చంపేందుకు దేవుడు కూడా అవతారాలు ఎత్తాలి.. నేను మామూలు మనిషిని’.. ఆకట్టుకునే డైలాగ్ తో ప్రారంభమైన ‘భళా తందనాన’ టీజర్ ఆకట్టుకునేలా ఉంది. టీజర్ లో చూపించిన ప్రతి డైలాగ్ ఇంటెన్స్ గానే ఉంది. ఈ టీజర్ ను చిత్ర బృందం ఇవాళ విడుదల చేసింది. ఇందులో శ్రీవిష్ణు హీరోగా చేస్తున్నాడు. కేథరీన్ ట్రెసా శశిరేఖగా కనిపించనుంది.

‘నిజాయతీగా ఉండాలనుకుంటే ఈ దేశంలో కామన్ మ్యాన్ కి కూడా రిస్కే’, ‘లంచం లేనిదే కంచంలో అన్నం కూడా దొరకట్లేదు’ అంటూ సాగే డైలాగ్ లు ప్రతి ఒక్కరినీ, సొసైటీని తాకేలా ఉన్నాయి. టీజర్ చివర్లో శ్రీవిష్ణు చెప్పే డైలాగ్ ఇక సూపర్ అనే చెప్పాలి. ‘‘సీఎం కుర్చీలో కూర్చున్న ఎవ్వరైనా ఒక్క సంతకంతో స్టేట్ ఫ్యూచర్ నే మార్చేయొచ్చు. అంటే.. ఆ పవర్ చేతిదా? కుర్చీదా?’’ అనే ఆ డైలాగ్ హైలైట్.

ఇక, ఆచార్య తర్వాత మణిశర్మ సంగీతం అందిస్తున్న సినిమా ఇది. ఈ టీజర్ లో ఆయన ఇచ్చిన బీజీఎం ఓ లెవెల్ లో ఉంది. చైతన్య దంతులూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో సినిమాను రిలీజ్ చేయనున్నారు.

Sri Vishnu
Tollywood
Bhala Tandanana
Varahi Chalana Chitram

More Telugu News