Andhra Pradesh: కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ వివరణ
- ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు
- ప్రభుత్వ ప్రకటనపై భిన్న స్పందనలు
- అన్ని అంశాలను పరిగణించామన్న విజయ్ కుమార్
- పాలన వికేంద్రీకరణ దృష్ట్యా నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై భిన్న స్పందనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ కొత్త జిల్లాలపై వివరణ ఇచ్చారు. సమతుల్యతతో కూడిన ప్రాంతీయ అభివృద్ధి, పాలన వికేంద్రీకరణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
ప్రతి జిల్లాకు కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఉండేలా చూశామని తెలిపారు. అయితే ఆయా జిల్లాల అవసరం మేరకు 3 రెవెన్యూ డివిజన్లు చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన అని విజయ్ కుమార్ వివరించారు.
గతంలో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు జిల్లాల్లో ఉండేవని, ఇప్పుడు ఒక అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ఒకే జిల్లాలో ఉండాలన్నది సర్కారు యోచన అని తెలిపారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రతిపాదనలు రూపొందించామని విజయ్ కుమార్ పేర్కొన్నారు.