Power: హైదరాబాద్ లో ఇవాళ 3 గంటల పాటు కరెంట్ కోతలు.. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడంటే..!
- పలు చోట్ల విద్యుత్ లైన్ల నిర్వహణ
- చాలా చోట్ల కరెంట్ సరఫరాకు అంతరాయం
- కొన్ని చోట్ల 4 గంటల దాకా కట్
విద్యుత్ లైన్ల నిర్వహణ పనుల్లో భాగంగా ఇవాళ హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడనుంది. ఒక్కో ప్రాంతంలో మూడు గంటల పాటు కరెంట్ ను విద్యుత్ అధికారులు కట్ చేయనున్నారు. కొన్ని చోట్ల 4 గంటల దాకా కూడా కరెంట్ ను ఆపనున్నారు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ కరెంట్ కట్ చేస్తారో వివరాలు వెల్లడించారు.
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు..
ఆదర్శనగర్, ఎస్బీఐ, బిర్లా మందిర్, ఆదర్శ్ కేఫె అండ్ బేకరీ, ఈఎస్ఐ, మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్, జలమండలి, సంజయ్ గాంధీ నగర్, పవర్ డిప్లొమా ఇంజనీర్ల సంఘ కార్యాలయం, బాగారెడ్డి డీటీఆర్, బిర్లా ప్లానెటోరియం, బాగారెడ్డి డీటీఆర్.
ఉదయం 10 నుంచి 2 గంటల వరకు..
ప్రకాశ్ నగర్, సంజీవయ్య పార్క్ సబ్ స్టేషన్ల పరిధిలోని ప్రకాశ్ నగర్ ఎక్స్ టెన్షన్ ఏరియా, ఆర్కా మసీదు, కామత్ లింగాపూర్, ప్రకాశ్ నగర్ వాటర్ ట్యాంక్ పరిసర ప్రాంతాల్లో కరెంట్ ఉండదు. నిజాంపేట్, చందానగర్ తదితర ప్రాంతాలు.
10.30 నుంచి 1.30 మధ్య..
మహేశ్ బాబు ఇల్లు, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 78, పద్మాలయ స్టూడియో, బాబూ జగ్జీవన్ రామ్ కాలనీ, పద్మాలయా స్లమ్ ఏరియా, ఈశ్వరపల్లి, సెంటర్ ప్రాంతం, పరుచూరి గోపాల కృష్ణ ఇంటి దగ్గర, యూసుఫ్ గూడ, మధురానగర్, మధురానగర్ జి–బ్లాక్, దేవరాయనగర్, సారా డిపో.
2 నుంచి 5 గంటల దాకా..
లుంబినీ పార్క్ ఎదురుగా ఉన్న ప్రాంతం, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ మార్గ్ , హనుమాన్ టెంపుల్, అమోఘం హోటల్, బాబూఖాన్ ఎస్టేట్, ఎల్బీ స్టేడియం మెయిన్ రోడ్డు, పెట్రోల్ బంక్, పోలీస్ కమిషనర్ ఆఫీస్, నిజాం హాస్టల్, ఎల్బీ స్టేడియం, జగదాంబ జువెలర్స్ బిల్డింగ్, ఎన్బీటీనగర్, శ్రీనివాస టవర్స్, వికార్ నగర్, అమోఘ్ ప్లాజా, మనీల్యాండ్ చైనా, బ్లూమూన్ హోటల్, ఎర్రగడ్డ మెయిన్ రోడ్, ఎఫ్ సీఐ గోడౌన్స్
2.30 నుంచి 5 గంటల వరకు
యూసుఫ్ గూడ ప్రధాన రహదారి, వెల్లంకి ఫుడ్స్, బీజేఆర్ కాలనీ, రామానాయుడు స్టూడియో, దుర్గానగర్ , సుభాష్ నగర్,