Keerthy Suresh: యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన కీర్తి సురేశ్

Keerthy Suresh starts Youtube Channel

  • యూట్యూబ్ ఛానల్ ప్రారంభించినట్టు ప్రకటించిన కీర్తి సురేశ్
  • తన ఛానల్ ను అందరూ సబ్ స్క్రైబ్ చేసుకోవాలని కోరిన కీర్తి
  • ఎల్లుండి విడుదలవుతున్న కీర్తి తాజా చిత్రం 'గుడ్ లక్ సఖి'

దక్షిణాదిన మంచి గుర్తింపు పొందిన హీరోయిన్లలో కీర్తి సురేశ్ ఒకరు. 'మహానటి' సినిమాతో ఎంతో పేరుప్రఖ్యాతులు తెచ్చుకున్న కీర్తి... వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. ఆమె నటించిన తాజా చిత్రం 'గుడ్ లక్ సఖి' ఈ నెల 28న థియేటర్లలో విడుదల కానుంది.

ఇదిలావుంచితే, ఆమె ఈ రోజు తన సొంత యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా తన ఛానల్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపింది. తన ఛానల్ ను అందరూ సబ్ స్క్రైబ్ చేసుకుని వీడియోలు చూడాలని కోరింది. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తన షార్ట్ వీడియోస్, ఫిట్ నెస్ తదితర వీడియోలను కీర్తి పంచుకోనున్నట్టు సమాచారం.

  • Error fetching data: Network response was not ok

More Telugu News