ITBP: మైనస్ 35 డిగ్రీల ఉష్ణోగ్రతలో గణతంత్ర వేడుకలు.. రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

Indo Tibetan Border Police celebrate RepublicDay at 15000 feet

  • దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న గణతంత్ర వేడుకలు
  • 15000 అడుగుల ఎత్తులో వేడుకలు నిర్వహించిన ఐటీబీపీ
  • బీజేపీ ప్రధాన కార్యాలయంలో జెండాను ఆవిష్కరించిన జేపీ నడ్డా

దేశవ్యాప్తంగా 73వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు (ఐటీబీపీ) మైనస్ 35 డిగ్రీల వాతావరణంలో వేడుకలు నిర్వహించారు. 15000 అడుగుల ఎత్తులో మైనస్ 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో జవాన్లు త్రివర్ణ పతాకంతో కవాతు నిర్వహించారు. గడ్డకట్టే చలిలో రెపరెపలాడుతున్న జెండాకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తిరుగుతోంది.

ఇక, ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నాగపూర్‌లోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో నాగ్‌పూర్ మహానగర్ సంఘ్ చాలక్ రాజేశ్ లోహియా జెండాను ఆవిష్కరించారు. భువనేశ్వర్‌లో ఒడిశా గవర్నర్ గణేషి లాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, తమిళనాడులో గవర్నర్ ఆర్ రవి, ముఖ్యమంత్రి స్టాలిన్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తదితరులు జాతీయ జెండాను ఆవిష్కరించి గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News