Sonu Sood: తన రాజకీయ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చిన సోనుసూద్

Sonu Sood gives clarity on his political entry

  • ఐదేళ్ల తర్వాత వచ్చే అవకాశం ఉందన్న సోను
  • ఇప్పుడు సేవా కార్యక్రమాల్లో ఉన్నానని వ్యాఖ్య
  • ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న సోను సోదరి

కరోనా ఫస్ట్ వేవ్ దెబ్బకు జనాలు అల్లాడుతున్న సమయంలో వేలాది మంది పేదల పాలిట సినీ నటుడు సోనుసూద్ ఆపద్బాంధవుడిగా నిలిచాడు. తద్వారా మన దేశంలో రియల్ హీరోగా నిలిచాడు. సోను ప్రారంభించిన సేవలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.

మరోవైపు సోనుసూద్ రాజకీయాల్లోకి వస్తాడనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఈ విషయంపై సోను తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఐదేళ్ల తర్వాత తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఇప్పుడు తాను పలు సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉన్నానని చెప్పారు.

ఇదిలావుంచితే, సోను సోదరి మాళవిక రాజకీయ ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. పంజాబ్ లోని మోగా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఆమె పోటీ చేస్తున్నారు. దీనిపై సోను మాట్లాడుతూ, మోగా నియోజకవర్గంతో తమకు ఎప్పటి నుంచో అనుబంధం ఉందని చెప్పారు. తన తల్లి ఆ ప్రాంతంలో ఎందరికో విద్యను అందించారని, విద్యకు సంబంధించిన వసతులను నెలకొల్పారని తెలిపారు. మరోవైపు తన సోదరి తరపున సోను ప్రచారం నిర్వహిస్తున్నారు.

Sonu Sood
Tollywood
Politics
  • Loading...

More Telugu News