Nagachaithanya: మళ్లీ మొదలెట్టేసిన 'థ్యాంక్యూ'

Thank you movie update

  • విక్రమ్ కుమార్ నుంచి 'థ్యాంక్యూ'
  • చైతూ సరసన నాయికగా రాశి ఖన్నా
  • సంగీత దర్శకుడిగా తమన్
  • వేసవిలో విడుదల  

నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' సినిమా రూపొందుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా, ఆల్రెడీ కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. అయితే చైతూ ముందుగా 'బంగార్రాజు'ను పూర్తిచేయవలసి రావడంతో, 'థ్యాంక్యూ' సినిమా షూటింగును ఆపుకోవలసి వచ్చింది.

ఇప్పుడు 'బంగార్రాజు' విడుదల కావడం .. హిట్ కొట్టడం కూడా జరిగిపోయాయి. అందువలన చైతూ మళ్లీ 'థ్యాంక్యూ' సెట్స్ పైకి వెళ్లాడు. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను పూర్తిచేసే ఆలోచనలో ఉన్నారు. ఏప్రిల్ నాటికి ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేయాలనీ, ఆ తరువాతనే ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలని భావిస్తున్నారట.

'ఉగాది'కి ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను విడుదల చేయాలనీ, వేసవిలో సినిమాను వదలాలనే ఉద్దేశంతో ఉన్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో అవికా గోర్ .. మాళవిక నాయర్ కూడా కథానాయికలుగానే సందడి చేయనున్నారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో రూపొందుతున్న ఈ సినిమా హిట్ కొట్టడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Nagachaithanya
Rashi Khanna
Thank You Movie
  • Loading...

More Telugu News