Sensex: కుప్పకూలిన మార్కెట్లు.. ఏకంగా 1,545 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

Sensex looses 1545 points

  • వరుసగా ఐదో సెషన్ నష్టపోయిన మార్కెట్లు
  • 468 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 6 శాతం వరకు నష్టపోయిన టాటా స్టీల్

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో సెషన్ లో కూడా నష్టపోయాయి. అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూలతలు లేకపోవడం, విదేశీ ఇన్వెస్టర్లు భారీ ఎత్తున అమ్మకాలకు మొగ్గుచూపడం మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.

ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు... ఆ తర్వాత ఏ సమయంలోనూ పుంజుకోలేకపోయాయి. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,545 పాయింట్లు పతనమై 57,491కి దిగజారింది. నిఫ్టీ 468 పాయింట్లు కోల్పోయి 17,149కి పడిపోయింది.

బీఎస్ఈ సెన్సెక్స్ లో ఈరోజు అన్ని షేర్లు నష్టపోయాయి. టాటా స్టీల్ (-5.98%), బజాజ్ ఫైనాన్స్ (-5.97%), విప్రో (-5.35%), టెక్ మహీంద్రా (-5.14%), టైటాన్ (-5.05%) రిలయన్స్ ఇండస్ట్రీస్ (-4.06%) టాప్ లూజర్లుగా ఉన్నాయి.

  • Loading...

More Telugu News