Dharmapuri Srinivas: కాంగ్రెస్ లోకి డీఎస్ చేరిక వాయిదా.. కారణం ఇదే!

Reason for D Srinivas joining Congress delayed

  • ఈరోజు కాంగ్రెస్ లో చేరాల్సిన డీఎస్
  • కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ కు అస్వస్థత 
  • గత డిసెంబర్ 16న సోనియాతో భేటీ అయిన డీఎస్

మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు డి.శ్రీనివాస్ తన సొంతగూడు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉన్న ఆయన ఆ పార్టీలో ఇమడలేకపోతున్నారు. టీఆర్ఎస్ అధిష్ఠానానికి, ఆయనకు మధ్య సంబంధాలు ఏమాత్రం బాగోలేవు. దీంతో ప్రస్తుతం టీఆర్ఎస్ ఎంపీగా ఉన్న ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నారు. అంతేకాదు టీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఎంపీ పదవికి కూడా ఆయన రాజీనామా చేయనున్నట్టు సమాచారం.

మరోవైపు ఈరోజు ఆయన సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరాల్సి ఉంది. అయితే ఆ కార్యక్రమం వాయిదా పడింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ అనారోగ్యానికి గురయ్యారు. ఈ కారణంగానే కాంగ్రెస్ లోకి డీఎస్ చేరిక వాయిదా పడింది. గత ఏడాది డిసెంబర్ 16న కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో డీఎస్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ లో చేరేందుకు డీఎస్ కు సోనియా అనుమతినిచ్చారు.

Dharmapuri Srinivas
TRS
Congress
Sonia Gandhi
  • Loading...

More Telugu News