Keerthi Suresh: మన రాతను మనమే రాసుకోవాలా: 'గుడ్ లక్ సఖి' ట్రైలర్ రిలీజ్!

Good Luck Sakhi Trailer Relased

  • నగేశ్ కుకునూర్ నుంచి 'గుడ్ లక్ సఖి'
  • గిరిజన యువతి పాత్రలో కీర్తి సురేశ్ 
  • కీలకమైన పాత్రలో జగపతిబాబు
  • ఈ నెల 28వ తేదీన విడుదల

కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రగా 'గుడ్ లక్ సఖి' సినిమా రూపొందింది. సుధీర్ చంద్ర నిర్మించిన ఈ సినిమాకి నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కీర్తి సురేశ్ గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక గిరిజన యువతిగా కనిపించనుంది. ఆమె ఎదురొస్తే మంచిది కాదనే నమ్మకంతో ఆ ఊరి జనాలు ఉంటారు. అలాంటి ఆమె రైఫిల్ షూటర్ గా ఏ స్థాయికి ఎదిగిందనేదే కథ.

కీర్తి సురేశ్ జోడీగా ఆది పినిశెట్టి నటించగా, కీలకమైన పాత్రలో జగపతిబాబు కనిపించనున్నాడు. ఈ నెల 28వ తేదీన ఈ  సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను వదిలారు. గిరిజన యువతిగా కీర్తి సురేశ్ యాస .. వేషధారణ .. నడకలో పూర్తి వైవిధ్యం చూపించారని తెలుస్తోంది.

నాయిక ప్రతిభను గుర్తించి ఆది పినిశెట్టి ఆమెను జగపతిబాబు దగ్గరికి తీసుకుని రావడం.. రైఫిల్ షూటర్ గా ఆయన ఆమెను తీర్చిదిద్ది విజయం సాధించేలా చేయడం ఈ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి. 'మహానటి' తరువాత నాయిక ప్రధానమైన పాత్రలతో కీర్తి సురేశ్ చేసిన 'పెంగ్విన్' .. 'మిస్ ఇండియా' నిరాశపరిచాయి. ఇక ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News