Ed: బెంగళూరులో కార్వీ చైర్మన్ పార్థసారథి అరెస్ట్

Ed Arrests Karvy Cmd In Fraud Case

  • హైదరాబాద్ కు తరలింపు
  • కస్టడీ కోరనున్న ఈడీ
  • మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు

మనీలాండరింగ్ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, ఇన్వెస్టర్లను నిండా ముంచిన కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ సి.పార్థసారథిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. అనంతరం హైదరాబాద్ కు తరలించారు. కోర్టులో హాజరు పరిచి కస్టడీ కోరనున్నట్టు అధికార వర్గాల సమాచారం. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద పార్థసారథిపై ఈడీ లోగడ కేసు నమోదు చేసింది.

ఇన్వెస్టర్లకు సంబంధించిన షేర్లను వారి అనుమతి లేకుండా, వారికి చెప్పకుండా కార్వీ స్టాక్ బ్రోకింగ్ తన ఖాతాల్లోకి మళ్లించుకుని, వాటిపై బ్యాంకుల నుంచి రుణాలు పొందడం తెలిసిందే. ఆ రుణాలను పార్థసారథి తనకు సంబంధించిన రియల్ ఎస్టేట్ సంస్థల్లోకి మళ్లించినట్టు అప్పట్లోనే వెల్లడైంది. ఈడీ ఈ ఆరోపణలపై దర్యాప్తు చేస్తోంది. కార్వీ తీసుకున్న రుణాల విలువ రూ.3,000 కోట్ల వరకు ఉంటుందని ఈడీ అంచనా వేస్తోంది.

Ed
karvy
partha saradhi
arrest
  • Loading...

More Telugu News