Pawan Kalyan: వెంకయ్యనాయుడు త్వరగా కోలుకోవాలి: పవన్ కల్యాణ్

Pawan Kalyan wishes vice president Venkaiah Naidu a speedy recovery

  • రెండోసారి కరోనా బారినపడిన వెంకయ్యనాయుడు
  • హోం ఐసోలేషన్ లో ఉపరాష్ట్రపతి
  • వెంకయ్య కరోనా బారినపడడం విచారకరమన్న పవన్

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రెండోసారి కరోనా బారినపడడం తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. వెంకయ్యనాయుడు కరోనాకు గురికావడం విచారకరం అని పేర్కొన్నారు. వెంకయ్యనాయుడు త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడై దేశ ప్రజల సేవలో నిమగ్నం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు తన ప్రకటనలో పేర్కొన్నారు. కరోనా పాజిటివ్ రావడంతో వెంకయ్యనాయుడు ప్రస్తుతం హైదరాబాదులో హోం ఐసోలేషన్ లో ఉన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News