Shoaib Akhtar: కోహ్లీని కెప్టెన్ గా తప్పుకునేలా చేశారు.. భారత్ కు ఓటమి మామూలే: షోయబ్ అక్తర్

Virat Kohli Was orced To Leave India Captaincy

  • కోహ్లీ కావాలని అయితే తప్పుకోలేదు
  • అతడు గొప్ప బ్యాట్స్ మ్యాన్
  • ఆటపై దృష్టి పెట్టాలి
  • మెల్ బోర్న్ లోనూ మాదే విజయం

పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ భారత జట్టు పనితీరును మెరుగుపరుచుకోవాల్సిన అవసరాన్ని పరోక్షంగా గుర్తు చేశాడు. వచ్చే టీ20 ప్రపంచ కప్ లోనూ భారత జట్టును పాకిస్థాన్ ఓడించడం ఖాయమన్నాడు.

‘‘మెల్ బోర్న్ లో భారత్ ను మేము మళ్లీ ఓడిస్తాం. టీ20 క్రికెట్ లో పాకిస్థాన్ జట్టు భారత్ కంటే మెరుగైన స్థానంలో ఉంది. క్రికెట్ లో భారత్, పాకిస్థాన్ తలపడే సందర్భాల్లో భారత్ మీడియా తమ సొంత జట్టుపై అనవసర ఒత్తిడి తీసుకొస్తోంది. కానీ, ఓడిపోవడం భారత్ కు సాధారణమే’’అని అక్తర్ పేర్కొన్నాడు.

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీని జట్టు సారథిగా తప్పుకునేలా చేశారని అక్తర్ వ్యాఖ్యానించాడు. గతేడాది టీ20 ప్రపంచ కప్పు తర్వాత టీ20 జట్టు కెప్టెన్ గా కోహ్లీ తప్పుకున్నాడు. దీంతో వన్డే జట్టుకు సైతం కోహ్లీని తప్పించి రోహిత్ శర్మకే బీసీసీఐ బాధ్యతలు అప్పగించింది. దీనిపై అక్తర్ స్పందించాడు.

‘‘విరాట్ కెప్టెన్సీని విడిచిపెట్టలేదు. అలా చేసేలా వ్యవహరించారు. అతడికి ప్రస్తుతం కాలం కలసి రావడం లేదు. అయితే, ఏ ప్రతిభతో పైకి వచ్చాడో దాన్నే మరోసారి నిరూపించుకోవాలి. అతడో మంచి వ్యక్తి, క్రికెటర్. గొప్ప బ్యాట్స్ మ్యాన్, ప్రపంచంలో ఇతర క్రికెటర్ల కంటే ఎక్కువే సాధించాడు. అతడు ఆటపైనే దృష్టి పెట్టాలి. వేటినీ పట్టించుకోకూడదు’’ అని సూచించాడు.

Shoaib Akhtar
pakistan cricketer
virah kohli
  • Loading...

More Telugu News