Taslima Nasreen: ప్రియాంకా చోప్రా ‘సరోగసీ’ మాతృత్వంపై విమర్శలతో విరుచుకుపడిన తస్లీమా నస్రీన్

Author Taslima Nasreen take on surrogacy kicks up Twitter storm

  • సమాజంలో పేదలు ఉంటే ఇలాంటివి సాధ్యమే
  • దీనికి బదులు అనాథ చిన్నారిని దత్తత తీసుకోవచ్చుగా
  • ఇలాంటి వారికి మాతృత్వ భావాలు కలుగుతాయా?
  • ట్విట్టర్ లో పోస్ట్ లు

సరోగసీ విధానం (గర్భాన్ని అద్దెకు తీసుకుని శిశువును కనడం)లో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా తల్లి అయినట్టు ప్రకటించడంతో.. ప్రముఖ వివాదాస్పద బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా విమర్శలు సంధించారు.

‘‘సరోగసీ విధానం సాధ్యమే. ఎందుకంటే సమాజంలో పేద మహిళలు ఉన్నందున. ధనవంతులు తమ ప్రయోజనాల కోసం సమాజంలో పేదలు ఉండాలని ఎప్పుడూ కోరుకుంటుంటారు. పిల్లలను పెంచుకోవాలని అనిపిస్తే అనాధల్లో ఒకరిని దత్తత తీసుకోవాలి. మీ లక్షణాలను పిల్లలు వారసత్వంగా పొందాలి. అంతేకానీ, ఇది కేవలం స్వార్థపూరితమే’’అంటూ నస్రీన్ పోస్ట్ పెట్టారు.

సరోగసీ విధానంలో రెడీమేడ్ బేబీలను పొందుతున్నప్పుడు ఇటువంటి తల్లులు ఎలా ఫీలవుతారు. తమ బిడ్డను స్వయంగా కన్న తల్లులకు మాదిరే భావాలు వీరిలోనూ ఉంటాయా?’’అని మరో పోస్ట్ లో తన అభిప్రాయాలు తెలిపారు. కొందరు యూజర్లు తస్లీమా నస్రీన్ అభిప్రాయాలతో ఏకీభవించారు. ఎక్కువ మంది సరోగసీనా లేక దత్తత తీసుకోవాలా? అన్నది వ్యక్తిగత ఇష్టానికి సంబంధించిన విషయంగా పేర్కొన్నారు. కొందరు అయితే వైద్య పరమైన కారణాల రీత్యా సరోగసీ విధానాన్ని ఎంచుకుంటారని కామెంట్ పెట్టారు.

  • Loading...

More Telugu News