Raghu Rama Krishna Raju: నీ ప్రేమ బాణాలు విశాఖ నవ యువతుల మీద విసురుతున్నావు అంట కదా?: ర‌ఘురామ‌కృష్ణ‌రాజు

raghurama slams ycp mp vijayasai

  • విజ‌య‌సాయిరెడ్డికి ర‌ఘురామ కౌంట‌ర్
  • పని చెయ్యకుండా ప్రజలను పీక్కుతింటున్నారు
  • మిమ్మల్ని త్వరలో ఆ ప్రజలే రాళ్లతో కొడతారు
  • 'ఏ1' నీకు రాజ్యసభ రెన్యువల్ చెయ్యడు అంట

'నలభై ఏళ్ల అనుభవమే ఈ వయసులో పక్కవాళ్ల‌కు ప్రేమ బాణాలు వేస్తుంటే అతని ప్రేమకోసం పడరాని పాట్లూ పడుతున్నావా ర‌ఘురామా?' అంటూ వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. దీనిపై స్పందించిన‌ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు దీటుగా కౌంట‌ర్ ఇచ్చారు.

'నువ్వు నీ ప్రేమ బాణాలు విశాఖ నవ యువతుల మీద విసురుతున్నావు అంట కదా! పని చెయ్యకుండా ప్రజలను పీక్కుతింటున్న మిమ్మల్ని త్వరలో ఆ ప్రజలే రాళ్లతో కొడతారు. నువ్వు ఎన్ని ట్వీట్లు పెట్టినా ఏ1 నీకు రాజ్యసభ రెన్యువల్ చెయ్యడు అంట. ముందు నువ్వు ఏ1 చేతిలో తన్నులు తినకుండా ఉండేలా చూసుకో' అని ర‌ఘురామ‌కృష్ణ‌రాజు చుర‌క‌లంటించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News